![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -834 లో.. జగతితో జరిగిందంతా చెప్తాడు మహేంద్ర. అప్పుడు రిషిని గుర్తుచేసుకొని జగతి ఎమోషనల్ అవుతుంది. శైలేంద్ర, వదినపై రిషి చాలా నమ్మకం పెంచుకున్నాడు.. ఇప్పుడు మనం ఏది చెప్పినా వినే సిచువేషన్ లో లేడని మహేంద్ర అంటాడు. నువ్వు చెప్పినా రిషి వినిపించుకోడా అని జగతి ఏడుస్తుంది.
ఆ తర్వాత దేవయాని అటుగా వెళ్తూ.. ఏడుస్తున్న జగతిని చూసి లోపలికి వచ్చి.. ఏమైంది ఏడుస్తున్నావ్? రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగి ఇంట్లో అందరిని పిలుస్తుంది. అందరూ రాగానే జగతి ఏడుస్తుంది. రిషి గురించి ఏమైనా తెలిసిందేమోనని దేవయాని అనగానే.. ఏమైంది జగతి.. రిషి గురించి తెలిసిందా అని ఫణీంద్ర అడుగుతాడు. లేదు తెలిస్తే మీకు చెప్తాం కదా అని మహేంద్ర అంటాడు. రిషి త్వరగా వస్తాడనిపిస్తుందని ఫణింద్ర అంటాడు. అవునా నాక్కూడా అనిపిస్తుందని జగతి అంటుంది. రిషి ఎక్కడ ఉన్నా బాగుంటాడు.. ఎవరు ఎన్ని చేసిన రిషికి మా ఆశీర్వాదం ఉంటుందని శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ జగతి అంటుంది.
మరొకవైపు రిషి మిషన్ ఎడ్యుకేషన్ గురించి స్టూడెంట్స్ కి చెప్తాడు. సోషల్ మీడియాని ద్వారా అందరికి అందుబాటులో ఉండాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వసుధార మేడమ్ ని అడగండని స్టూడెంట్స్ కి రిషి చెప్తాడు. ఆ తర్వాత స్టూడెంట్స్ తో రిషి మాట్లాడడం వసుధార చూస్తుంది. విశ్వనాథ్ వాళ్ళింటికి వసుధార వెళ్లి.. రిషి సర్ అంటూ కోపంగా అరుస్తుంది. ఏమైందని ఏంజిల్ అడిగినా సమాధానం చెప్పకుండా.. రిషి గదిలోకి డైరెక్ట్ గా వెళ్తుంది. ఏంటీ మేడమ్ ఇలా డైరెక్ట్ గదిలోకి వస్తున్నారని రిషి అంటాడు. మీరు మీ గురించి ఆలోచించారా? మీకు అంత పెద్ద అటాక్ జరిగింది.. అయినా మీరు ఒక్కరే కాలేజీకి ఎందుకు వచ్చారంటూ అడుగుతుంది. అది నీకు అవసరం లేదు వసుధార అని రిషి అంటాడు. అప్పుడే 'ఏమైంది వసుధార?' అని విశ్వనాథ్, ఏంజిల్ వస్తారు. నేను ఒక్కడినే కాలేజీ కి వెళ్ళాను కదా.. మొన్న ఎటాక్ జరిగింది.. ఎందుకు వెళ్తున్నారని అడుగుతుంది అని రిషి చెప్తాడు. వసుధార చెప్పింది కూడా నిజమే కదా కొంచెం జాగ్రత్తగా ఉండు రిషి.. నేను రిషి ని జాగ్రత్తగా చూసుకుంటా అని విశ్వనాథ్ అంటాడు. సరే మేడమ్ మీరు వెళ్ళండని వసుధారకి రిషి చెప్తాడు.
ఆ తర్వాత వసుధార ఆటోలో ఇంటికి వెళ్తుంటుంది. అప్పుడే దారికి అడ్డంగా రిషి కార్ ఆపుతాడు. రిషి కార్ లో నుండి బయటకు వచ్చి.. మేడం మీతో మాట్లాడాలని వసుధారతో అనగానే.. పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. ఏంటి మేడమ్ మీరు నాపై ప్రేమ చూపిస్తున్నట్టు అందరికి గతం తెలిసేలా చెయ్యాలనుకుంటున్నారా అని అడుగుతాడు. లేదు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాని వసుధార అంటుంది. అయినా మీకెందుకని వసుధారతో రిషి అంటాడు. మరి మీరు నాకు దెబ్బ తాకినప్పుడు నన్ను జాగ్రత్తగా ఎందుకు చూసుకున్నారంటూ వసుధార ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మీకు నాపై ప్రేమ ఉందంటూ మాట్లాడి వెళ్ళిపోతుంది. పొగరు తగ్గదని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |